శ్రీ బాల గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న 7వ డివిజన్ కార్పొరేటర్ : వేల్పుల రవీందర్

0
2

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ RK-8 కాలనీలోని శ్రీ బాల గణేష్ మండలి వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్ 50 కిలోల బియ్యాన్ని అందజేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుక మల్లేష్, సీనియర్ నాయకులు గండు మల్లయ్య, మాడ తిరుపతి రెడ్డి, కమిటీ సభ్యులు MPTC కనకయ్య, రోడ్డ నాగరాజు, అంబాల సంపత్, ఓరుగంటి నవీన్, చిలుక అనురాగ్, నేరెళ్ల శివతో పాటు మహిళలు ఆరుకొండ మంజు, ఓం తదితరులు పాల్గొన్నారు.