ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలి…. వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కలవడం జరిగింది

0
1

దుగ్గొండి : ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలోచేర్చాలని ఆ కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒలిగె నర్సింగరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను హైద రాబాద్లో గురువారం కలిసి వినతిపత్రం అందజే సింది. అనంతరం నర్సింగరావు మాట్లాడారు. ఆరె కులస్తులు బీసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర అన్ని రంగాల్లోనూ తీవ్ర వెనుకబాటు తనానికి గురవుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండెకారి రవికుమార్, నాయకులు ఖాతరబాజి చిరంజీవి, కోర్కెల ప్రశాంత్, మడతలపాటి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు…