గనులలో పనిముట్లు, సేఫ్టీ పరికరాలు అందించాలి : ఏఐటియుసి

0
2

శ్రీరాంపూర్: SRP 3&3A గని ఆవరణలో కార్మికులకు అవసరమైన పనిముట్లు, సేఫ్టీ పరికరాలను సకాలంలో అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ AITUC గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా ఆధ్వర్యంలో గని మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు. కార్మికులకు అవసరమైన పరికరాలను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చి ఉత్పత్తి, ఉత్పాదకతకు ఆటంకం లేకుండా చూడాలని బాజీ సైదా డిమాండ్ చేశారు. జాప్యం కొనసాగితే కార్మికుల ఆందోళన తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, షిఫ్ట్ కార్యదర్శులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.