గరికపాడులో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు రూ.6 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో ఐ క్లీన్ మెటల్ సిస్టమ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు

0
3

జగ్గయ్యపేట మండలం, గరికపాడు గ్రామంలో ఐ క్లీన్ మెటల్ సిస్టమ్స్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో రూ.6 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు సోమవారం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు._

 

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు మాట్లాడుతూ* 

 

_గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో సీఎస్‌ఆర్ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు ఎంతో అవసరమని, ఈ ప్లాంట్‌ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు._

 

_ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఐ క్లీన్ మెటల్ సిస్టమ్స్ కంపెనీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు._

 

_ఈ సందర్భంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని అందించిన కొత్తా గోవిందరావు గారి కుమారులు పూర్ణచంద్రరావు, సుధాకర్ గార్లను ఎమ్మెల్యే గారు అభినందించారు._

 

_అనంతరం అంతర్గత సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు ప్రారంభించారు._

 

_ఈ కార్యక్రమంలో కసుకుర్తి శ్రీనివాసరావు, యానాల గోపీచంద్, ఐ క్లీన్ మెటల్ సిస్టం కంపెనీ ప్రతినిధులు, సావిత్రమ్మ గారు, అప్పన రమణయ్య, ఇంటూరి రఘు, తాళ్లూరి గామయ్య మరియు గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు._