Madanapalle: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో నిరసన. వీఆర్వో సస్పెన్షన్‌కు డిమాండ్.

0
3

Madanapalle: గాలివీడు మండలం ఎగువ గొట్టివేడు గ్రామం మావిళ్లపల్లిలో పేద మహిళ మావిళ్ల శ్రీదేవి సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ గ్రామ వీఆర్వో నిర్మల్‌కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.