Madanapalle: మదనపల్లె డివిజన్‌లో నూతన సీఐల బాధ్యతల స్వీకరణ. తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి శాంతిభద్రతలకు ప్రాధాన్యం.

0
3

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో సీఐల బదిలీల నేపథ్యంలో నూతనంగా బదిలీపై వచ్చిన అధికారులు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లె తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. మదనపల్లె తాలూకా సీఐగా పనిచేస్తున్న కళా వెంకటరమణ బి.కొత్తకోటకు బదిలీపై వెళ్లగా, ఇప్పటివరకు మదనపల్లె రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐగా విధులు నిర్వహించిన మహమ్మద్ రఫీ తాలూకా సీఐగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా మదనపల్లె వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా మోహన్‌కుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పోలీస్‌శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించేలా విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు