జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మండలం, త్రిపురవరం గ్రామంలోని విజయవాడ గో సంరక్షణ సంఘం (త్రిపురవరం గోశాల) వద్ద మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు) గారు పాల్గొన్నారు._
_ఈ సందర్భంగా గణనాథునికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో గోవులకు నిరంతరం నీటి సదుపాయం కల్పించేందుకు తన సొంత ఖర్చులతో రూ.1 లక్ష వ్యయంతో బోరు, మోటార్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరాం చిన్నబాబు గారు మోటార్ స్విచ్ ఆన్ చేసి బోరును ప్రారంభించారు._
_గోశాల సంరక్షణతో పాటు గోవులకు నీటి సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చి సొంత ఖర్చుతో బోరు, మోటార్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాం చిన్నబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు._
_గోసంరక్షణకు తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని, గోవుల సంరక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని శ్రీరాం చిన్నబాబు గారు తెలిపారు._










