ఖర్గేతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ!

0
4

న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, అనంతరం తెలంగాణలో తాజా రాజకీయ, పరిపాలనా పరిణామాలపై చర్చించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై జరిగిన అనుచిత వ్యాఖ్యల అంశం, 22A భూముల సమస్య, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ఖర్గే ఆరా తీసినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయం, తాగునీటి రంగాలపై దాని ప్రభావం తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర సహాయాన్ని కోరుతూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.