రెండు రోజులకు మించి ఫైళ్లు నిలిచిపోకూడదు: అధికారులకు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వార్నింగ్.

0
2

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పాలనా వ్యవహారాల్లో జాప్యాన్ని నివారించేందుకు, ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. శాఖలోని ఏ స్థాయిలోనైనా ఫైలు పరిశీలన రెండు రోజులకు మించి నిలిచిపోకూడదని, అలాగే ఏ రకమైన వినతి లేదా అంశంపైనైనా గరిష్ఠంగా 15 రోజుల్లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేలా స్పష్టమైన మార్పు తేవాలని ఆయన నిరూపించారు. అనవసర జాప్యానికి కారణమయ్యే బాధ్యులైన అధికారుల నుంచి తక్షణ వివరణ తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

   

 

మంగళగిరిలోని ఆఫీసులో ఫైళ్ల పరిష్కారం, వైద్య సిబ్బంది హాజరుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిన 4,420 అంశాల్లో ఎక్కువ భాగం బదిలీలకు సంబంధించినవే ఉన్నాయని, అయితే అందులో కేవలం 40 శాతం ఫైళ్లు మాత్రమే పరిష్కారం కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.