సాగరన్న జన్మదిన వేడుకల్లో సందడి మంచిర్యాలలో ఘనంగా బైక్ ర్యాలీ.. మంత్రుల హాజరుతో ప్రత్యేక ఆకర్షణ

0
4

మంచిర్యాల : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. CCC కార్నర్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.