Madanapalle: మదనపల్లెలో గుడ్లు, చిక్కీల సరఫరా అవకతవకలపై కలెక్టరేట్ ఎదుట యుఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌పీ ఆధ్వర్యంలో ఆందోళన; రికార్డుల ట్యాంపరింగ్‌పై ఆరోపణలు.

0
2

Madanapalle: గుడ్లు, చిక్కీల సరఫరాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై యుఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌పీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యుఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్వేపల్లి నరసింహులు, ఏఐఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లవకుమార్‌ మాట్లాడుతూ రికార్డుల పరిశీలన పేరుతో లెక్కల్లో మార్పులు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించిన గుడ్ల సంఖ్య, సరఫరాదారులకు చెల్లించిన సంఖ్య మధ్య ఉన్న తేడాలను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ భౌతిక రికార్డులను ఇప్పుడు ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.