🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మునిసిపల్ లోని 1వ వార్డులో పెన్షన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా కొనసాగుతోంది. స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు స్వయంగా ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వార్డులోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వినోద్ కుమార్ లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, 1వ వార్డు సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా ఉండేందుకు, సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు చేరేలా వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు, స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.










