నిజామాబాద్‌లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి దీపాలు వెలిగిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.










