మంచిర్యాల: భూమి బదలాయింపు ధ్రువీకరణ, పట్టా పాస్బుక్ల జారీకి లంచం డిమాండ్ చేసిన గ్రామ పరిపాలన అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.1.30 లక్షలు లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి దుర్గ ప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
తొలి విడతగా రూ.80 వేలను తన సహాయకుడు పోతు రాజేందర్‌కు ఇవ్వాలని దుర్గ ప్రసాద్ ఫిర్యాదుదారుడికి సూచించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో రాజేందర్ నుంచి రూ.80 వేల లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాజేందర్ చేతులకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి గ్రామ పరిపాలన అధికారి దుర్గ ప్రసాద్‌తో పాటు అతని సహాయకుడు పోతు రాజేందర్‌ను అధికారులు అరెస్టు చేశారు.









