లింగం చెరువు వద్ద బందోబస్తు పరిశీలన.|

0
11

● భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి

● పోలీసు అధికారులకు పలు సూచనలు

సూరారం, సెప్టెంబర్ 23: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సూరారం లింగం చెరువును కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ బుధవారం సందర్శించారు. చెరువు పరిసరాల్లో చేపట్టిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చెరువు పరిసరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీసీపీ ఆదేశించారు. బందోబస్తు సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

#Sidhumaroju

Alwal