టీచర్లపై దాడికి జగనే సూత్రధారి: సౌమ్య

0
3

నందిగామ భారత్ అవాజ్ : శాప్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. బుధవారం నందిగామలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆందోళనల పేరుతో అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. టీచర్లపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రజలు శాంతియుత వాతావరణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.