బొజ్జ గణపతిని దర్శించుకున్న డీసీ బోగేశ్వర్లు.|

0
12

● బొల్లారం బొజ్జ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు

● అధికారులతో కలిసి పూజల్లో పాల్గొన్న డీసీ

● సురేందర్ రెడ్డి చేతుల మీదుగా డీసీకి సత్కారం

అల్వాల్, సెప్టెంబర్ 23: మచ్చ బొల్లారంలోని పురాతన, ప్రసిద్ధ బొజ్జ గణపతి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలకు అల్వాల్ డీసీ బోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

డీఈ మహేష్, డీఈ ఎస్‌డబ్ల్యూఎం సందీప్‌తో కలిసి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు సురేందర్ రెడ్డి డీసీ బోగేశ్వర్లను శాలువాలతో సత్కరించారు. 

ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన వితరణలో డీసీ బోగేశ్వర్లు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సర్వేశ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal