భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

0
3

కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 

 నందిగామ, సెప్టెంబర్ 23 : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. వర్షాల పరిస్థితి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే సంబంధిత శాఖలకు చేరవేసి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపాత వివరాలను ప్రతి రెండు గంటలకు నమోదు చేసి సంబంధిత అధికారులు, మీడియాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండి అత్యవసర సమాచారం అందిన వెంటనే స్పందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల అత్యవసర సమాచారం కోసం కంట్రోల్ రూమ్: 9154970454కు సంప్రదించాలని తెలిపారు.

– జిల్లా సమాచార శాఖ, విజయవాడ