భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచనలు

0
2

భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచనలు

 

నందిగామ, సెప్టెంబర్ 23: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజులు నందిగామ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు.

మున్నేరు నది, వాగులు, కాలువలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారితే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రైతులు, పశుపోషకులు పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, మత్స్యకారులు మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని కోరారు.

మున్నేరు పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, అవసరమైన చోట ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.