విశాఖ పశ్చిమ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ముక్య నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లతో సమన్వయ కమిటీ సమావేశం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారి అధ్యక్షతన జరిగింది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే వార్డు స్థాయిలో సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల అర్హులైన ప్రతి పేదవాడికి సజావుగా అందేలా చూడాలని, అత్యవసర వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి (CMRF) నుండి మజురైన చెక్కులను బాధితులకు వేగంగా పంపిణీ చేసి ఆదుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అలాగే తుపాను ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని పార్టీ శ్రేణులను గణబాబు గారు ఆదేశించారు.
Home Andhra Pradesh రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి – విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ...









