ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో గురువారం పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగింది. ఈ పరిశీలన కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీ అంజయ్య గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి పెన్షన్ లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కమిషనర్ గారు మాట్లాడుతూ. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఖచ్చితంగా అందేలా చూడాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు, మున్సిపల్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










