బ్యాంకు సెలవులు, ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 61.80 లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,692.34 కోట్లు విడుదల చేసిందని, అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని అదే రోజు మధ్యాహ్నం నుంచి సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు.
#RAJESH










