చింతూరు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి అందించారు. వరదల కారణంగా సాధారణ జీవనం స్తంభించి, ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న బాధితులకు భోజనం అందించడం ద్వారా ట్రస్ట్ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఆహారం, అవసరమైన సహాయాన్ని అందిస్తూ అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. వరద పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు.. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాధితులకు భోజన సదుపాయం కల్పిస్తామని జమాల్ ఖాన్ తెలిపారు. వరదలు కొనసాగినన్ని రోజులు ఈ భోజన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. భోజన సాయం అందించిన జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్‌కు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
# Yadagiri










