ప్రభుత్వాలు మారినా, అధికారులు మారిన ఏజెన్సీ అభివృద్ధిలో మారని దుస్థితి.

0
1

చింతూరు ఏజెన్సీలో యేళ్ల తరబడి ఇదే పరిస్థితి ప్రభుత్వాలు మరిన అధికారులు మారిన సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వ్యవహారం, చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి స్వర్ణ గ్రామ పంచాయతీ ప్రధాన వీధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇటీవల తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షలకు నిండు కుండని తలపిస్తున్న దుస్థితి, ప్రజా ప్రతినిధులు ఏళ్ళ తరబడి మారుతున్న అభివృద్ధి మాత్రం శూన్యం. రహదారి వెంట నడవాలంటే అంగన్వాడి పిల్లలు, బడి పిల్లలు, వీధి జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కనీసం విద్యార్థులు చదువుతున్న బడిలో కూడా పరిశుభ్రత లేకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల కలవరపెడుతుంది, వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు, బడి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు.

 

# Yadagiri