జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు విద్యుత్ సెక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 22 మంది రైతులకు 8 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను (DTRs) జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారి సమక్షంలో ఈరోజు రైతులకు అందజేశారు._
చిల్లకల్లు సెక్షన్ పరిధిలో 26-09-2026 నాటికి మొత్తం 128 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం 8 డీటీఆర్‌ల కేటాయింపుతో 22 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ 22 కనెక్షన్లను పూర్తి చేసిన అనంతరం మరో 106 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో మిగలనున్నాయి._
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు మాట్లాడుతూ
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్‌తో పాటు పగటిపూట 9 గంటల నాణ్యమైన 3-ఫేజ్ విద్యుత్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు._
రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులు తమ వ్యవసాయ పనులను సకాలంలో చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్, సాగునీరు, ఇతర మౌలిక వసతులను అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు._
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రైతు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే గారు తెలిపారు. అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తూ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు._
చిల్లకల్లు సెక్షన్ పరిధిలో ఇంకా పెండింగ్‌లో ఉన్న 106 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు మరో 12 డీటీఆర్‌లు అవసరమున్నాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ 12 డీటీఆర్‌లను కేటాయించేందుకు ఉన్నతాధికారులు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
అదనపు డీటీఆర్‌లు కేటాయించిన వెంటనే పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను దశలవారీగా పూర్తి చేసి, రైతులకు విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు స్పష్టం చేశారు._
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది – రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు._
ఈ కార్యక్రమంలో పేరం సైదేశ్వర రావు, కర్ల జోజి, వేదులపురి సైదా, ఆదిమల్ల రమేష్, చిలుకూరి కార్తీక్, జ్వాల నాయక్ మరియు రైతులు రైతు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు._










