రోలుగుంట మండలంలోని అన్ని గ్రామాలలో సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ఓటు వేసిన ప్రజలకు జడ్పిటిసి సుర్ల సత్యం నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇకపై మీలో ఒకడిగా మీకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు.










