నందిగామలో సెప్టెంబర్ 28న జాబ్ మేళా

0
4

🟢10 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు.. రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలు

▶️నందిగామసెప్టెంబర్26 Bharat Aawaz : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 28న సోమవారం ఉదయం 9 గంటలకు నందిగామ గాంధీ సెంటర్‌లోని APNGO’s బిల్డింగ్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి సి. మధుభూషణ్ రావు తెలిపారు.

జాబ్ మేళాలో సుమారు 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000 నుంచి రూ.35,000 వరకు వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

తప్పనిసరిగా రిజిస్ట్రేషన్

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని తెలిపారు.

మరిన్ని వివరాలకు 8919951682, 9700025833, 7207208075 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి సి. మధుభూషణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.