బుచ్చంపేటలో పోషణ మాసం అంగనవాడి ఉత్సవాలు

0
1

 అనకాపల్లి జిల్లా రోలంగుంట మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు రావికమతం సిడిపిఓ ఆదేశాల మేరకు రోలుగుంట మండలం బుచ్చంపేట సెక్టార్ లోని బుచ్చంపేట 1, 2, 3 అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసం మరియు అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలు, బాలింతలు, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలు మరియు మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. పౌష్టికాహార పంపిణీతో పాటు ప్రీస్కూల్ కార్యక్రమాలు, పీపీ 1 మరియు పీపీ 2 పుస్తకాలు, ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు వర్క్ బుక్ ల ద్వారా విద్య అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ సేవలు లబ్ధిదారులందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు.ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకంలో భాగంగా మొదటిసారి గర్భం ధరిస్తే 5,000 రూపాయలు, రెండవసారి గర్భం ధరించి ఆడపిల్లకు జన్మనిస్తే 6,000 రూపాయలు లబ్ధిదారులకు అందుతాయని వివరించారు. అంగన్వాడీలో ప్రీస్కూల్ పిల్లలకు తాజా వేడి భోజనంతో పాటు ఆటపాటలు, కథల ద్వారా వయసుకు తగ్గట్టుగా ప్రీస్కూల్ నిర్వహిస్తున్నారని తెలిపారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవంతో పాటు అంగన్వాడీ ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని అంగన్వాడీ ఉత్సవాలను సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 7 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించనున్నారు.