అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం. వినాయక చవితి సందర్భంగా రోలుగుంట గ్రామంలో జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ సొర్ల సత్యనారాయణ మనవళ్లు సొర్ల సత్యం నాయుడు, సుర్ల రామకృష్ణ, సుర్ల గణేష్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ లో మొత్తం 25 జట్లు పాల్గొన్నాయి.
పోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి 10,000 రూపాయలు మణికంఠ మరియు వేణు జట్టు అనకాపల్లి కైవసం చేసుకుంది. రెండవ బహుమతి 8,000 రూపాయలు జగదీష్ మరియు పార్టనర్ పెదబొడ్డేపల్లి జట్టుకు దక్కింది. మూడవ బహుమతి 5,000 రూపాయలు ఆదిత్య మరియు పార్టనర్ భీమిలి జట్టుకు, నాలుగవ బహుమతి 3,000 రూపాయలు నాయుడు మరియు మోహన్ రోలుగుంట జట్టుకు లభించాయి.ఈ కార్యక్రమంలో సుర్ల నరసింహమూర్తి, సుర్ల సత్యం నాయుడు, గుమ్మలూరు చంద్రమౌళి, మద్దతీలు, స్వర్ణ నాయుడు, రుత్తల శ్రీనివాసరావు, ఏక సత్యనారాయణ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.










