మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కోర్టులో ICJS, CIS వినియోగంపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-చార్జిషీట్లు, ఈ-సమ్మన్స్, పెండింగ్ కేసులు, పోలీస్–న్యాయశాఖ సమన్వయంపై చర్చించారు. కేసుల పురోగతిని వారానికోసారి సమీక్షించి, నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలని సీపీ అధికారులకు సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.








