ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 84 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు. అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆమె, ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. బ్యాంకింగ్ ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని, మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే సంబంధిత బ్యాంకును సంప్రదించి తమ ఖాతాను ఫ్రీజ్ చేయించుకోవాలని ఎస్పీ నితిక పంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









