Madanapalle: మదనపల్లె కొత్త ఇండ్లు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వాసవి క్లబ్ మదనపల్లె ఆధ్వర్యంలో ఆరు సీలింగ్ ఫ్యాన్లను వితరణ చేశారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు సహాయ సహకారాలు అందించాలని ప్రధానోపాధ్యాయురాలు విష్ణుప్రియ రెడ్డి వాసవి క్లబ్ సభ్యులను కోరగా, క్లబ్ ప్రెసిడెంట్ వీవీ కృష్ణారావు మరియు సభ్యులు స్పందించారు. ఇందులో భాగంగా రూ.12 వేల విలువైన ఆరు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు అందజేశారు. క్లబ్ సభ్యుడు దేవకి మణిధర్ తన వంతు సహాయాన్ని అందించారు.










