భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలంలోని పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో గడ్డి కత్తిరించే యంత్రాలు (చాఫ్ కట్టర్లు) పంపిణీ చేశారు. రైతు సేవా కేంద్రం ద్వారా ముందుగా నమోదు చేసుకున్న 12 మంది పాడి రైతులకు ఈ యంత్రాలను అందజేశారు.పాడి రైతులు పశువులకు నాణ్యమైన పశుగ్రాసాన్ని సులభంగా అందించేందుకు చాఫ్ కట్టర్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఇంకా ఆసక్తి ఉన్న పాడి రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు చేసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ పి. మల్లికార్జున, MPDO అశోక్ కుమార్ రెడ్డి, PDO శ్రీనాథ్ రెడ్డి, AHA గంగులప్ప, AHA రామకోటమ్మ తదితరులు పాల్గొన్నారు.










