గాంధీ జయంతి సందర్భంగా గోపాలపట్నం జడ్పీ హైస్కూల్లోని జాతిపిత, మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు గాంధీజీ ఆదర్శాలను నిత్య జీవితంలో అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం పాఠశాలకు నూతనంగా ఎన్నికైన పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.









