Madanapalle: అక్టోబర్ 13న తిరుచానూరులో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు మదనపల్లెలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ వెల్లడించారు.

0
1

మదనపల్లె: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 13న తిరుచానూరులో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తెలిపారు. మదనపల్లె సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద సంవత్సరాల క్రితం తిరుచానూరు దేవాలయంలోకి ఓ దళితుడు ప్రవేశించగా పోలీసులు అరెస్టు చేశారని చింతా మోహన్ తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా మహాత్మా గాంధీ తిరుచానూరు దేవాలయం ఎదుట సత్యాగ్రహం నిర్వహించారని పేర్కొన్నారు. ఆ చారిత్రక ఘటనకు స్మృతిగా అక్టోబర్ 13న తిరుచానూరులో దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.