ఉప్పల్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

0
1

ఉప్పల్: ఉప్పల్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ వార్డు కార్యాలయ ఆవరణలో ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు ఈగ ఆంజనేయులు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ వేడుకలకు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

అనంతరం నాయకులు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశం కోసం ఆయన చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ఉప్పల్, చిలకనగర్ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు.