హైదరాబాద్ వేదికగా ప్రపంచ నాయకుల సమాగమం.. భారత్ సమ్మిట్‌లో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయంపై కీలక చర్చలు!

0
3

ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, సాంకేతిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.

ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరై ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సత్యం, అహింస, ప్రేమ ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశమై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక భద్రత, సంక్షేమ చర్యలను ప్రారంభించారు. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సదస్సు హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

— భారత్ ఆవాజ్, హైదరాబాద్