గజపతినగరం లైబ్రరీ ఆవరణలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతుల సమస్యలపై విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సు కరపత్రాలను కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాకోటి రాములు మాట్లాడుతూ, కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు సోదరులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును జయప్రదం చేయాలని కోరారు.
#RAJESH










