హసన్ భాషను కేంద్ర మంత్రికి పరిచయం చేసిన సీఎం చంద్రబాబు
తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పీఎంఏవై–గ్రామీణ్ 2.0 పథకం కింద ఇళ్ల నిర్మాణానికి మంజూరైన సహాయానికి సంబంధించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ జనాబ్ షేక్ హసన్ భాష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శాలువాలు కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హసన్ భాషను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పరిచయం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కూటమి నాయకులతో కలిసి హసన్ భాష పాల్గొన్నారు.










