నందిగామ , అక్టోబర్ 04:bharat aawaz
నందిగామ 18వ వార్డు డివిఆర్ కాలనీలో నూరానీ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో గ్యార్వీ షరీఫ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హజ్రత్ గౌసే పాక్ వారి పేరుతో లంగర్ షరీఫ్ (సామూహిక అన్నదాన విందు) ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ప్రార్థనల అనంతరం చిన్నారులు, యువత ఆకుపచ్చ జెండాలతో కాలనీ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. లంగర్ షరీఫ్ విందుకు ముస్లిం పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముతవల్లీ షేక్ అబ్దుల్ రహీం, షేక్ నిజాముద్దీన్, అస్గర్, కరీం బాషా, జానీ, ఖాజా తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గ్యార్వీ షరీఫ్ సోదరభావం, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ముతవల్లీ షేక్ అబ్దుల్ రహీం తెలిపారు.










