రుద్రంపేట గ్రామంలో ఘనంగా గణనాథుని నిమజ్జన వేడుకలు

0
4

రోలుగుంట మండలం రత్నంపేట గ్రామంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. శ్రీ వీరాంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.గ్రామంలో కొలువైన గణనాథుడికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం లడ్డూ వేలం పాట నిర్వహించగా, భక్తుల మధ్య పోటీ నెలకొంది. చివరకు ఒక భక్తుడు రూ. 75 వేలకు లడ్డూను దక్కించుకుని స్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా స్వామివారి శోభాయాత్ర వైభవంగా సాగింది. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్ని నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నిప్పుల మధ్య కళాకారులు చేసిన విన్యాసాలు, సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.రాత్రి వేళలో గ్రామస్తులంతా కలిసి వడ్డిప గైరమ్మ చెరువు వద్దకు చేరుకుని, భక్తి శ్రద్ధలతో గణపతి ప్రతిమకు నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో చెరువు ప్రాంగణం మార్మోగింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గ్రామ పెద్దలు యూత్ సభ్యులను అభినందించారు. నిమజ్జన ఏర్పాట్లను నిర్వాహకుడు నాగేష్ పర్యవేక్షించారని గ్రామస్తులు తెలిపారు.