రెండు రోజులుగా ఘనంగా ఆదివాసి దేవుడు భీముని పెళ్ళి వేడుకలు.

0
2

పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌ పరిధిలోని కల్లేరు గ్రామంలో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా దేవుడు భీముని పెళ్లి వేడుకలు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు పెళ్లి పందిరి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించి, భీమునికి ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు. రెండో రోజు కూడా వివిధ ఆచారాలు, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తూ భీముని పెళ్లి వేడుకలను వైభవంగా జరిపారు. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని భీముని పెళ్లి వేడుకలను విజయవంతం చేశారు. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంప్రదాయాలను కొనసాగిస్తూ భీముని పెళ్లి వేడుకలను నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

 

# Yadagiri