విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న వారికి బహుమతుల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఇంద్రా హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ షెహనాజ్ బేగం, ఇన్‌చార్జ్ ఎం.డి. అఫ్సర్ సర్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎం. సంతోష్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పండుగ విశిష్టతను చాటిచెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అతిథులు, పాఠశాల యాజమాన్యం అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేసి వారిని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీక అని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
విద్యార్థుల ఉత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతో ఇంద్రా హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.










