ఆపదలో మేమున్నామంటూ ఆసరా ఫౌండేషన్ , సమాజ సేవకుడు డాక్టర్ ఆర్ గోపికృష్ణ

0
4

 కరీంనగర్ జిల్లా ఆసరా ఫౌండేషన్ ( ఆపదలో సహాయానికి రా) వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్. గోపి కృష్ణ ఆపదలో 42 వ సారి రక్తదానంతో ఆదుకున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి తెలిపారు. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వ్యక్తి (60) గుండెకు ఆపరేషన్ నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు యూనిట్ల అరుదైన ‘ఒ” నెగటివ్ రక్తం అవసరం కాగా డాక్టర్ ఆర్. గోపి కృష్ణ 42 వ సారి మరియు సంస్థ సభ్యుడు పి. విజయ్ రెడ్డి 11వసారి రక్తదానంతో ఆదుకున్నారు. ఈ సందర్భంగా రక్తదానంతో ప్రాణదాతగా నిలిచి ఎంతో మంది యువతను రక్తదానం పట్ల ప్రోత్సహిస్తున్న డాక్టర్ ఆర్. గోపి కృష్ణను మరియు విజయ్ రెడ్డి లను సంస్థ ఉపాధ్యక్షులు కె. ప్రవీణ్ సభ్యులు జి.తిరుపతి, బి. మహేష్, ఎం. రవిచందర్, ఎస్. నిఖిల్ తదితరులు అభినందించారు.