ఖమ్మం జిల్లా అల్లిపురంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు పరిశీలించారు.
ఈ నెల 12న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్న నేపథ్యంలో, మంత్రి అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు.
అల్లిపురంలో శ్రీవారి ఆలయ నిర్మాణంతో ఖమ్మం ప్రాంతానికి మరో ఆధ్యాత్మిక ఆకర్షణ రానుంది.









