● అదనపు కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి
● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో వినతిపత్రం
అల్వాల్, అక్టోబర్ 13: అల్వాల్ మండల పరిధిలోని శివనగర్ (కనాజిగూడ), తుర్కపల్లి ప్రాంతాల్లో 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు అదనపు కలెక్టర్‌ను కలిసి, ఆయా ప్రాంతాల్లోని భూములను 22/ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, దేవయ్య గౌడ్, మోసిన్, విజయశేఖర్, జేడీ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










