పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

0
3

 ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి,పెద్దపల్జి జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన గోదావరిఖనిలో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ పరీక్షల సన్నద్ధతను అంచనా వేసుకుని, పోటీ పరీక్షల్లో మెరుగైనప్రతిభ,కనబరిచేందుకు  అక్టోబర్ 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1గంటవరకుపరీక్షనిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రోత్సాహకంగా మొదటి బహుమతిగా రూ.10,000, రెండో బహుమతిగారూ.5,000,మూడోబహుమతిగా రూ.2,000నగదుబహుమతులుఅందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 100 మంది అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటుభోజనం,వసతిసౌకర్యాలుకల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు https://forms.gle/EwsqCLeErjgEPTih6 లింక్ ద్వారా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 7780543055, 8886304040 నంబర్లలో సంప్రదించగలరు.