ఇంద్రానగర్‌లో ఘనంగా 26వ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం గ్యార్వీ షరీఫ్ కార్యక్రమానికి హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే

0
1

నాచారం, ఇంద్రానగర్: హైదరాబాద్‌లోని నాచారం ఇంద్రానగర్ చౌరస్తా వద్ద ఘౌసుల్ వారా ముస్లిం వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు, ముస్లిం మత గురువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గ్యార్వీ షరీఫ్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యత, సర్వమత సామరస్యం వెల్లివిరియాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు, వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు