నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి గుడ్ న్యూస్.. పదవీకాలం పెంచిన ఏపీ ప్రభుత్వం.

0
1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల పదవీకాలాన్ని మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు తమ విధుల్లో కొనసాగనున్నారు.

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పాలనాపరమైన అభివృద్ధి పనుల అమలుకు ఎలాంటి ఆటంకం కలగకుండా, వాటిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం పదవుల్లో ఉన్న నేతల పనితీరు, శాఖల మధ్య సమన్వయం ఆధారంగా ఈ పొడిగింపు వర్తిస్తుందని తెలుస్తోంది.