● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
● సంక్షేమ విధివిధానాలు ఖరారు చేసి అర్హులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
ఆల్వాల్ అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం సాగించి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి.
అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరం వేదికగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన విధివిధానాలను త్వరితగతిన ఖరారు చేసి, అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
27వ రోజు దీక్షలో భాగంగా పి. శ్రీనివాస్ గౌడ్, బి. వెంకటేష్, కే. శ్రీనివాస్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎ. సత్యనారాయణ, రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎ. రామచంద్రం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దీక్షలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దయాకర్, ముత్యాలు, మంద శోభన్, మురళి, మల్లేష్, సంగమేశ్వర్, రాము తదితరులు పాల్గొని ఉద్యమకారుల దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.
#Sidhumaroju
Alwal










